ఖమ్మం అర్బన్ మండలం రుద్రమ్మకోట గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి వైభవంగా శంకుస్థాపన చేశారు. మామిడి తోరణాలతో అలంకరించిన ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గ్రామస్థులు ప్రత్యేక పూజలు, భూమి పూజ నిర్వహించారు. గ్రామ దేవత ఆలయ నిర్మాణంతో ఊరికి సుఖశాంతులు చేకూరుతాయని భక్తులు ఆకాంక్షించారు.