TG: సీఎం రేవంత్ సెల్ఫ్ ఎన్యుమరేషన్(జనగణన వివరాల నమోదు) ప్రక్రియలో పాల్గొన్నారు. అధికారిక వెబ్సైట్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థంగా చేరాలంటే ఖచ్చితమైన గణాంకాలు అవసరమని, పౌరులందరూ బాధ్యతగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.