NTR: విజయవాడలో ఫుట్‌పాత్ ఆక్రమణలను సోమవారం పోలీసులు తొలగించారు. కేదరాశ్వర్ పేట నుంచి ఎర్రకట్ట వరకు ఇరువైపులా ఫుట్‌పాత్‌పై నెలకొన్న వ్యాపార దుకాణాలు తొలగించారు. పాదచారుల సౌకర్యంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఫుట్‌పాత్‌పై ఆక్రమణలను తొలగిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్సై వెంకట్ కుమార్ తెలిపారు.