నంద్యాల: జిల్లాలో ఆదివారం కావడంతో మాంసం దుకాణాల వద్ద రద్దీ అధికంగా కనిపించింది. నంద్యాల, వెలుగోడు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో వినియోగదారులు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు చేశారు. ఈరోజు కేజీ మటన్ రూ.1000, స్కిన్లెస్ చికెన్ రూ.250, విత్ స్కిన్ రూ.230, లైవ్ చికెన్ రూ.195గా ఉన్నాయి. చేపలు కేజీ రూ.180, గుడ్లు డజను రూ.70గా విక్రయిస్తున్నారు.