RR: షాద్నగర్ నియోజకవర్గం వెలిజర్ల గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ బాబు నాయక్ బాల్య వివాహ విముక్తి రథాన్ని ప్రారంభించి పోస్టర్ను ఆవిష్కరించారు. పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ.. సమాజం అభివృద్ధి చెందాలంటే బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించాల్సిందేనని స్పష్టం చేశారు.