PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని సవర కోటపాడు ఐటీడీఏ పార్కును సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ గురువారం సందర్శించి అభివృద్ధి పనులపై సమీక్షించారు. పార్కు ఆవరణలో నిర్మించిన షాపుల వివరాలు తెలుసుకుని వాటిని టెండర్ల ద్వారా కేటాయించాలని సూచించారు. పండ్లు, పూలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, అలంకార మొక్కలను పెంచి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు.