AKP: కసింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ స్వామి నాయుడు గురువారం తెలిపారు. రాత్రి సమయాల్లో వాహనచోదకులకు డ్రైవింగ్ లో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు డ్రమ్ములు, పాత టైర్లకు రంగులు వేసి రేడియం రిఫ్లెక్టర్లు అమర్చినట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశామన్నారు.