AP: రాష్ట్రంలో వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్ పడింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వార్డుల పునర్విభజనపై హైకోర్టు స్టే విధించింది. GNT, ONG, ధర్మవరం, కడప, రాయచోటి, ఏలూరు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ స్టే వర్తిస్తుంది. వార్డుల పునర్విభజన సహేతుకంగా జరగలేదని హైకోర్టులో మాజీ కార్పొరేటర్లు పిటిషన్లు దాఖలు చేశారు. రెగ్యులర్ బెంచ్ విచారణ జరిగే వరకు స్టే కొనసాగనుంది.