TG: రాష్ట్రంలో పలు సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున అనేక సంస్థలు తమ నూతన కేంద్రాల ఏర్పాటు, తదుపరి విస్తరణల కోసం HYD వస్తున్నాయన్నారు. అమెరికా టెలికాం దిగ్గజం TMUS గ్లోబల్ సొల్యూషన్స్ నూతన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ను హైటెక్ సిటీలో ప్రారంభోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు.