లావా ఇంటర్నేషనల్ తన సరికొత్త ‘లావా బోల్డ్ N2 5G’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 120Hz డిస్ప్లే, Unisoc T8200 ప్రాసెసర్‌తో పాటు 6000mAh బ్యాటరీని అందించారు. దీని అసలు ధర రూ.12,999 కాగా, ఈనెల 9 నుంచి ప్రారంభ ఆఫర్ కింద రూ.11,999 ప్రత్యేక ధరకే అమెజాన్‌లో లభించనుంది. కస్టమర్ల కోసం ఉచిత హోమ్ సర్వీస్ సదుపాయాన్నీ కల్పిస్తున్నారు.