నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీస్ దర్బార్ నిర్వహించారు. ఏఆర్ పోలీసులు, హోమ్ గార్డులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హెడ్‌క్వార్టర్స్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, వారాంతపు సెలవులు, పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ రియాజ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.