బాపట్ల నుంచి రేపల్లెకు వెళ్తున్న RTC బస్సు ముందు టైరు ఒక్కసారిగా పంచర్ కావడంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. టైరుకు మేకు గుచ్చుకుని పంక్చర్ అయిందని తెలిపారు. ఈ ఘటనలో అదుపుతప్పిన బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా, వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. జిల్లా రవాణా అధికారి విమల చొరవతో ప్రయాణికులను ఇతర బస్సులలో తరలించారు.