నల్గొండ మండలం కొత్తపల్లిలో రోడ్లు భవనాల & సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే కాలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నతమైన పదవి పొందాలని నాయకులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.