JN: జఫ్ఫరగడ్ మండలంలో వరి కొయ్యలను కాల్చవద్దని ఎస్సై రామారావు రైతులకు శనివారం సూచించారు. కొయ్యలు కాల్చడం వల్ల అగ్నిప్రమాదాలు జరిగి పక్క పంటలు, ఆస్తులకు నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. అలాగే పర్యావరణానికి హాని జరుగుతుందని పేర్కొని, రైతులు ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరారు. కొయ్యలు కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.