TG: సూర్యాపేట జిల్లా మధు హత్యను మాజీమంత్రి హరీష్ రావు ఖండించారు. నల్గొండ జిల్లాలో గతంలో కక్షలు పెట్టింది పేరుగా ఉండేదని పేర్కొన్నారు. KCR పాలనలో జిల్లా శాంతియుతంగా ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నాయకుల జోక్యం ఎక్కువైందని ఆరోపించారు. హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాగా, పాత కక్షలతో మధు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.