AP: రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఒక ‘ఏఐ డాక్టర్’ ఉంటారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యాన్ని మించినది లేదన్న ఆయన.. ‘సంజీవని’ పథకం కింద ఇంటి నుంచే 74 రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై నుంచి ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. ఏదైనా జబ్బు చేస్తే ఏఐ డాక్టర్ను సంప్రదించి ఇంటి నుంచే చికిత్స పొందవచ్చని వెల్లడించారు.