కృష్ణా: యువత క్రీడల పట్ల ఆసక్తి చూపటం శుభ పరిణామం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం చల్లపల్లిలో మాజీ సర్పంచ్ సజ్జా వెంకటేశ్వరరావు స్వగృహంలో సజ్జా చలపతి రావు ఆధ్వర్యంలో పది క్రికెట్ టీంలకు ఎమ్మెల్యే చేతులమీదుగా కిట్స్ బహుకరించారు. పిల్లలు, యువకులు సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా ఆరోగ్యం ఇచ్చే క్రీడల పట్ల ఆసక్తి చూపాలని కోరారు.