KNR: జిల్లాలో బోగస్ సంస్థల పేరిట నకిలీ వేబిల్లులతో గ్రానైట్ ప్లేట్లు హైదరాబాద్కు తరలిస్తూ భారీ స్థాయిలో జీఎస్టీ ఎగవేత జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా డీజీజీఐ తనిఖీల్లో ఒకే సంస్థ కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్టు గుర్తించినట్లు సమాచారం.