నిర్మల్ జిల్లా బాసరలో డీజిల్ కొరత తీవ్రంగా మారింది. హెచ్పీతో సహా పలు పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు డీజిల్ కోసం మహారాష్ట్ర సరిహద్దులోని ధర్మాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. డీజిల్ లేక ట్రాక్టర్లు, లారీలు నిలిచిపోవడంతో రైతులు, బాసర ఆలయానికి వస్తున్న భక్తుల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.