PLD: స్థానిక కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ప్రతి నెల నాలుగవ శనివారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ సంజన సింహ అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.