ELR: ఓబులవారిపల్లి మండలం సి. కమ్మపల్లిలో గురువారం రాత్రి రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడినట్లు ఎస్సై మహేశ్ నాయుడు తెలిపారు. బీరువాలు పగలగొట్టి ఒక ఇంటిలో సుమారు 4 తులాల బంగారం చోరీ చేశారన్నారు. అదే రాత్రి దిగువపల్లిలో నిద్రిస్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించారని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.