NRPT: ప్రైవేట్ విద్య సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్లో PDSU, PYL, POW ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. సీపీఐ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ మాట్లాడుతూ.. ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.