ప్రకాశం: కనిగిరి పురపాలక సంఘాన్ని స్వచ్ఛతలో ప్రథమ స్థానంలో నిలిపే లక్ష్యంతో మే 23 నుంచి జూన్ 20 వరకు ‘ఆపరేషన్ క్వీన్ స్వీప్’ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో 36 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. రోడ్లు, డ్రైన్లు, మార్కెట్లు శుభ్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు చెప్పుకొచ్చారు.