AKP: కలెక్టరేట్లో శుక్రవారం డీఐఈపీసీ సమావేశం జరిగింది. కలెక్టర్ విజయ క్రిష్ణన్ మాట్లాడుతూ.. కొత్త పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. సింగిల్ డెస్క్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, వసతులు, రుణాలు, సబ్సిడీలు అందించాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలో పరిశ్రమలు పెట్టకుంటే భూముల అనుమతులు రద్దు చేస్తామన్నారు.