PDPL: జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో యూరియా రాక్ పాయింట్, వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాక్ పాయింట్ నుంచి యూరియా సప్లై జిల్లా వ్యాప్తంగా వేగవంతం చేయాలని సూచించారు. అలాగే వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకు వస్తున్న ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు.