ELR: కామవరపుకోట మండలంలోని సొసైటీలు, ఎరువుల షాపుల్లో డీఏపీ, యూరియా అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏవో ముత్యాలరావు తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఎరువులను అవసరమైన రైతులకు మాత్రమే విక్రయించాలని, రైతులు కూడా అవసరం మేరకే కొనుగోలు చేయాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడొద్దని సూచించారు.