NLG: జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఛైర్మెన్‌గా చిట్యాల పట్టణానికి చెందిన బోడ స్వామి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండవసారి తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర ఛైర్మెన్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు, సహకరించిన జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.