అన్నమయ్య: వెంకప్పకోటలో ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు సందర్శనలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ ప్రారంభించారు. గ్రామ సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యమన్నారు. 31 అర్జీలు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూవివాదాలు, పట్టాదార్ పాస్బుక్, 22A, వారసత్వ మ్యుటేషన్ తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.