VZM: పిల్లల ప్రవర్తన, వారి కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని, వారి భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంతో కీలకమని ఎస్సై బి. గణేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం కొండగుంపాం, గరికపేట గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనుల్లో ఉన్న శ్రామికులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి, పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.