AP: కడప జిల్లా రాజంపేటలో అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీప్ లాడ్జిలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. 22 గదులకు మంటలు వ్యాపించడంతో ఒకరు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో లాడ్జీలో ఉన్న 33 మందిని పోలీసులు కాపాడారు. మృతుడు ప్రొద్దుటూరు కొర్రపాడుకు చెందిన వెంకటశ్రీనివాస్గా గుర్తించారు.