MDCL: మల్కాజ్గిరి పరిధిలోని బండ చెరువు, షఫీ నగర్, హనుమాన్ నగర్, మౌలాలి, భారత్ నగర్ ప్రాంతాల్లో దోమల విపరీతంగా పెరిగినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల వద్ద నిల్వ నీరు, డ్రైనేజీ సమస్యల వల్ల పరిస్థితి విషమించిందని చెబుతున్నారు. వెంటనే ఫాగింగ్, యాంటీ లార్వల్ చర్యలు చేపట్టి ప్రజలను వ్యాధుల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.