TG: నాగర్కర్నూల్ జిల్లా రైతులు హైదరాబాద్లోని కుషాయిగూడలో ధర్నా నిర్వహించారు. ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ సంస్థ యజమాని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ సంస్థ యజమాని రూ.2 వడ్డీ చెల్లిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు తీసుకున్నారని ఆరోపించారు. ఇలా 2,500 మంది రైతుల నుంచి రూ.250 కోట్లు వసూలు చేసినట్లు రైతులు చెబుతున్నారు.