VSP: మాదకద్రవ్యాల బారిన పడి యువశక్తి నిర్వీర్యమవుతోందని, వాటి నియంత్రణలో యువత భాగస్వామ్యం కీలకమని సిటీ పోలీస్ కమిషనర్ శంకరబ్రత బాగ్చీ అన్నారు. ఆదివారం ఆయన కార్యాలయంలో ‘దండి మార్చ్ 2.0’ సైకిల్ ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ర్యాలీ రాష్ట్రంలోని 25 విశ్వవిద్యాలయాల్లో అవగాహన కల్పిస్తూ ఈనెల 22న ఆంధ్రా యూనివర్సిటీకి చేరుకుంటుంది.