కోనసీమ: అమలాపురంలో సోమవారం PGRS మీకోసం, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రంలో మీకోసం కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.