NDL: కార్యకర్తను ప్రజా ప్రతినిధిగా చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. నందికొట్కూరులోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు. పార్టీకి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ సముచితస్థానం ఉంటుందన్నారు.