ADB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు త్వరితగతిన ఒక జత యూనిఫాం అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఈ నెల 14లోగా మహిళా శక్తి కుట్టుకేంద్రాల ద్వారా యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.