NZB: నగరంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యాచకుడు మృతి చెందాడు. ఈ ఘటన పులాంగ్ చౌరస్తా వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ట్రాఫిక్ ఎస్సై వినోద్ తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా ఆర్టీసీ బస్సు జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తా వద్దకు రాగా ఓ యాచకుడు ప్రమాదవశాత్తు బస్సు కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.