ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కర్షక కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లాధ్యక్షుడు బండి దత్తాత్రి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంఘ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రైతులకు సంవత్సరానికి సరిపడిన ఎరువులు, విత్తనాలను అందజేయాలన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్, రైతు భరోసా డబ్బులను అందజేయాలని కోరారు.