RR: హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై అవసరమైన చోట్ల అండర్ పాసులు నిర్మించాలని కోరుతూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు ఢిల్లీలో MP కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యను కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి, ప్రజల ఇబ్బందులు తొలిగేలా అండర్ పాసుల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.