ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారతానని, అందుకు అవకాశం ఇవ్వాలని ఆమె ఢిల్లీ కోర్టును అభ్యర్థించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తానని కోర్టుకు తెలిపింది.