ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఈనెల 19వ తేదీన ప్రవేశ పరీక్షా జరగనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రశాంత్ తెలిపారు. ఉదయం ఆరో తరగతి, మధ్యాహ్నం 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని, వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.