KMM: మధిర మండలం మడుపల్లి–ఏపీలోని తాళ్లూరు మధ్య శుక్రవారం మిర్చి కోతకు వెళ్లి వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో వేల్పుల అన్నపూర్ణమ్మ మృతి చెందగా, 10 మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్లో సుమారు 20 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గాయపడిన వారు మడుపల్లికి చెందిన వారిగా స్థానికులు గుర్తించి, క్షతగాత్రులను మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.