SRD: పట్టణం బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ ఉపాధి కార్యాలయంలో ఈనెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి నిర్మల తెలిపారు. అపోలో ఫార్మసీలో ఖాళీల భర్తీకి 18 నుంచి 35 ఏళ్లలోపు పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం 08455-271010 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.