NLG: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ స్థాయి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొని మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సభలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.