KMR: బిక్కనూర్ మండలం రామేశ్వర్పల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంపై గ్రామ వీడీసీ మాజీ అధ్యక్షుడు నరసారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరినట్లు తెలిపారు. తమ విన్నపానికి సానుకూలంగా స్పందించి తక్షణమే కేంద్రం ప్రారంభించడం అభినందనీయమన్నారు.