NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. కోతుల దాడిలో బండారు వజ్రమ్మ చేయి విరగడంతో కామినేని ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోగా, మోర పుల్లమ్మ నడుము విరిగి వలిగొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కోతుల గుంపులతో గ్రామస్తులు ప్రాణభయంతో వణుకుతున్నారు. అధికారులు స్పందించి, ప్రాణహాని కలగకముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags :