AP: గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పూర్తి చేసుకున్న నర్సింగ్ అసిస్టెంట్లకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని యువతకు నియామక పత్రాలను అందజేశారు. శిక్షణ పొందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వృత్తిలో రాణించాలని వారు ఆకాంక్షించారు.