MDK: వేసవికాలంలో మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు వాటరింగ్ చేయాలని రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ తార్యా నాయక్ సూచించారు. గ్రామంలోని నర్సరీని ఆయన ఆదివారం పరిశీలించారు. వేసవికాలం ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం నాటికి మొక్కలు ఎక్కువగా పెరిగేందుకు కృషి చేయాలని సూచించారు.