VKB: వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని బంట్వారం ఎస్సై విమల సూచించారు. పిల్లలు ఈత కోసం చెరువులు, కాలువల వద్దకు వెళ్లకుండా పర్యవేక్షించాలని, రోడ్లపై ఆటలు ఆడటం ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే మొబైల్ ఫోన్ల అతి వినియోగం వల్ల పిల్లలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, సెలవుల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని కోరారు.