SDPT: అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన బట్టు శంకర్(45) గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం రోజున శంకర్ చాతి నొప్పితో బాధపడడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు ప్లంబింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమైంది.